హైదరాబాద్: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్టకింద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బొమ్మల దుకాణంలో ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపించి 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రత కారణంగా రెండు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు స్థానికులు తెలిపారు. సమీపంలోని గ్రామపంచాయతీ కార్యాలయానికీ మంటలు వ్యాపించడంతో అక్కడున్న పలు కీలక దస్త్రాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు గ్రామపంచాయతీ సర్పంచ్ తెలిపారు. పోలీసులు, గ్రామస్థులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడం, ఆ సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగకుండా తప్పింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. 17 దుకాణాలు దగ్ధం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 07:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)