గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైదరాబాద్‌లో మౌలాబి పోస్టుమార్టం పూర్తి

14 సెప్టెంబర్, 2026

suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌: ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామంలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్‌ సెంటర్‌ వద్ద ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయపోరాటం చేస్తున్న విద్యార్థి తల్లి మౌలాబి ఇటీవల పురుగుల మందు తాగారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను తొలుత ఒంగోలులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మౌలాబి మృతి చెందారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే విషయంలో గత రెండు రోజులుగా గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో పోస్టుమార్టం పూర్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్