- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ర్ట కమిటీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నీట్ యుజి ఎంబిబిఎస్ అడ్మిషన్లలో మార్పులు తీసుకొస్తూ రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 102తో మెడికల్ విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్రనష్టమని ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది. ఈ జిఓ రద్దు చేసి జిఓ 151 ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్నకుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిఓ 102 ప్రకారం కౌన్సెలింగ్‌లో విద్యార్థులు అన్ని ఆప్షన్లు పెట్టుకునే అవకాశం లేకపోవడం వల్ల మెరిట్ ఉన్న రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు ఓపెన్ కేటగిరి సీట్లను విని యోగించుకునే హక్కును కోల్పోతారని తెలిపారు. 2019లో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ నివేదిక ఆధారంగా జిఓ 151 తీసుకొచ్చి పారదర్శకంగా, విద్యార్థులందరికీ ఆమోదయోగ్యంగా కౌన్సెలింగ్ జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను గంద రగోళానికి గురిచేసేలా ఉన్న జిఓ 102ను తేవడం వెనుక దురుద్దేశం దాగి ఉందనే అనుమానాలున్నా యన్నారు. కౌన్సెలింగ్‌లో నీట్ అర్హత సాధించిన విద్యార్థులు అన్ని ఆప్షన్లను తప్పనిసరిగా పెట్టుకునేలా స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని, 2, 3వ విడత కౌన్సెలింగ్‌లలో విద్యార్థులకు వెబ్ ఆప్షన్లను మార్చుకునే సంపూర్ణ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)