ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 85 వేల మంది కార్మికులకు జూన్, జూలై, ఆగస్టు నెలల పెండింగ్ వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయ రమాదేవి డిమాండ్ చేశారు.ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కమిటీ గురువారం ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల విద్యార్థుల భోజనానికి సంబంధించిన 26 నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 26 ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని, కనీస వేతనం అమలు చేయాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి వరలక్ష్మి, కోశాధికారి ఎం నాగమణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ సిహెచ్ సుప్రజ, సమ్మక్క, సహాయకార్యదర్శులు మంగకశ్రీ, నాగవరలక్ష్మి పాల్గొన్నారు.
Print Editionమధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు చెల్లించాలి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 09:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)