న్యూఢిల్లీ : దేశంలో భగ్గుమంటున్న ఆహార ధరలు, ద్రవ్యోల్బణం నుంచి ఎట్టకేలకు ఉపశమనం కల్పించడానికి కేంద్రం యోచన చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్ ప్రస్తుతం ఈ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించే అంశాన్ని కీలకంగా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ, పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది కాలంగా దేశంలో వంటనూనెల ధరలు దాదాపు 20 శాతం వరకు ఎగబాకాయి. భారత్ తన వంటనూనె అవసరాలలో దాదాపు మూడింట రెండు వంతుల భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. మలేషియా, ఇండోనేషియా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌లను కొనుగోలు చేస్తోంది. గతంలో 2025 మే నెలలో ముడి ఎడిబుల్ ఆయిల్స్‌పై ప్రాథమిక దిగుమతి పన్నును ప్రభుత్వం సగానికి తగ్గించి 10 శాతానికి చేర్చింది. అప్పుడు అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్, సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జ్ తో కలిపి దిగుమతి సుంకం 16.5 శాతానికి పడిపోయింది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు భారీగా పెరగడంతో వినియోగదారుడిపై భారం పడటం గమనార్హం.
Print Editionవంటనూనెల దిగుమతులపై సుంకాలు తగ్గింపు..!
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 10:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)