కోటా : రాజస్థాన్లోని కోటా జిల్లాలో ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడగా, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. కోటా జిల్లాలోని సిమ్లియా పోలీస్ స్టేషన్ పరిధిలో, కరాడియా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాలువలో పడిన మినీ బస్సు, 8 మంది మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)