ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మిషన్‌ ‌మార్చ్‌’ కార్యాచరణ ప్రారంభం

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 11:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ‘మిషన్‌ ‌మార్చ్‌ ఎస్‌ఎస్‌‌సి-2027’ కార్యాచరణ ప్రారంభమైందని ప్రభుత్వ పరీక్షల విభాగం బోర్డు డైరెక్టర్‌ ‌కెవి శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు, పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జాతీయ విద్యా విధానం-2020, జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-2023 మార్గదర్శకాల కు అనుగుణంగా ఎన్‌సిఇఆర్‌టి కి చెందిన పరాఖ్ సిఫార్సు చేసిన సామర్థ్య ఆధారిత విశ్లేషణ విధానానికి అనుగుణంగా రూపొందిం చినట్లు వెల్లడించారు. జులై 13 నుంచి నవంబరు 30‌వ తేదీ వరకు ఈ కార్యక్రమం అమల్లో ఉంటుందని వివరించారు. పాఠశాల పని దినాల్లో రోజూ సాయం త్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక విద్యా మద్దతు సెషన్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ పరీక్షల బోర్డు ఈ కార్యక్రమానికి సంబంధించి రోజువారీ షెడ్యూల్స్, క్వశ్చన్ బ్యాంకులు, స్టడీ మెటీరియల్, స్లిప్ టెస్ట్‌లను ప్రత్యేకంగా రూపొందించిన లీప్‌ ‌యాప్‌తో పాటు తమ వెబ్‌‌సైట్‌‌లో పొందుపరుస్తామన్నారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్