గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడు మోస్తరు వర్షాలు..విపత్తుల నిర్వహణ సంస్థ

05 ఆగస్టు, 2026

rains-1784609332.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 06:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ఫలితంగా బుధవారం నాడు ఉత్తరాంధ్ర జిల్లాలు, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ‌పడే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ‌ప్రఖర్‌ ‌జైన్‌ తెలిపారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 91.5 మిల్లీమీటర్లు, జోగినాధునిపాలెంలో 77.7, పెద బొడ్డేపల్లెలో 56.2, పెద ఉప్పలంలో 48.2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్