- ప్రధాన్ రాజీనామాపై జగన్
ప్రజాశక్తి - తాడేపల్లి : ‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోందని వైసిపి అధ్యక్షులు జగన్ అన్నారు. శనివారం సోషల్ మీడియా ఎక్స్ లో ప్రకటన విడుదల చేశారు. ‘ఇప్పుడు ఇదే ప్రశ్నను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నామని దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా? ఆని ప్రశ్నించారు. అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం తన కొడుకు పదవిని కాపాడుకుంటారా ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.








కామెంట్‌లు (0)