బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు నేమ్‌బోర్డులు

17 జులై, 2026

ward sachivalayam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 10:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 15,004 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో కొత్త నేమ్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు స్వర్ణ గ్రామ, సర్ణ వార్డు శాఖ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మార్చిన నామకరణానికి అనుగుణంగా నిర్ణయించిన సైజుల ప్రకారం ఎసిపి నేమ్‌బోర్డులను తయారు చేసి సరఫరా చేసే బాధ్యతను టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపికైన నెక్స్టోరా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంస్థకు అప్పగించినట్లు వెల్లడించారు. జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల, పట్టణ అధికారులు బోర్డులను స్వీకరించి సంబంధిత స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బోర్డుల ఏర్పాటు పూర్తైన అనంతరం స్వీకరణ పత్రాలు, ఇన్‌స్టాలేషన్ నివేదికలు, సంతృప్తి ధ్రువీకరణ పత్రాలను సంబంధిత సంస్థకు అందజేయాలని సూచించారు. అలాగే అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పర్యవేక్షించి, స్టాక్ రిజిస్టర్ నిర్వహణతో పాటు నేమ్‌ బోర్డుల ఏర్పాటు సక్రమంగా పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్