mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తాను ఉంది పెట్టుబడిదారులకు సేవ చేసేందుకే

1 గంట క్రితం

nara lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 11:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మంత్రి నారా లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​పెట్టుబడిదారులే తన కస్టమర్లు అని, వారికి సేవ చేయడానికే తాను ఉన్నానని విద్య,ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ ‌శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు.

కోల్‌కతాలో జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో పాల్గొన్న మంత్రి ‘ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు’ అనే అంశంపై శుక్రవారం మాట్లాడారు. పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా నిలబెట్టడం ఎంత సవాలుతో కూడుకుందో తనకు తెలుసునని అన్నారు. అందుకే తాము మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సాంప్రదాయంగా ప్రభుత్వాలు తమను నియంత్రణ సంస్థలుగా భావిస్తాయని, కానీ తాము సేవలందించే సంస్థలుగా భావిస్తున్నామని తెలిపారు. నెలలు, సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పనిలేదన్నారు. ఒక్కసారి తమతో చేతులు కలిపిన తర్వాత మీ ప్రాజెక్టును తమ ప్రాజెక్ట్ కింద చూస్తామన్నారు. తాను కేవలం ఒక వాట్సాప్ దూరంలోనే మీకు ఉన్నానని చెప్పారు. అందరం కలిసి పనిచేసి ఒక గొప్ప పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని తెలిపారు. బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయని పేర్కొన్నారు. సంస్కరణల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలని, ఏపీ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని కోరారు.రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే దేశం గెలుస్తుందని తాను విశ్వసిస్తానని చెప్పారు.తాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దశను దాటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అమలుచేస్తున్నామని తెలిపారు. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శ్యామ్, మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ సిఎండి బ్రిజ్ భూషణ్ అగర్వాల్, ఐసిసి వైస్ ప్రెసిడెంట్, సెంచురీ ప్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశవ్ భజంకతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రాష్ట్రప్రభుత్వంతో కలసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాల‌ని ఐటిసి సిఎండి సంజీవ్ పూరిని కలిసి లోకేష్‌ ‌కోరారు.ఈవి గ్రేడ్ అల్యూమినియం తయారీ యూనిట్ నెలకొల్పాలని శ్యామ్ మెటాలిక్స్ అండ్‌ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ షీతల్ అగర్వాల్, సూపర్ స్పెల్టర్స్ లిమిటెడ్ చీఫ్ మెంటర్ గోపాలకృష్ణ చరణ్, రష్మీ మెటాలిక్స్ లిమిటెడ్ డైరక్టర్ సంజీవ్ కెఆర్. పట్వారీల భేటీలో కోరారు. రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ సోలార్ హబ్ ఏర్పాటుచేయాలని విక్రమ్ సోలార్ సిఈఓ అరుణ్ మిట్టల్, ఎండి జ్జానేష్ చౌదరిని లోకేష్‌ ‌కోరారు. రాష్ట్రంలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయాలని హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ సిఎండి అనురాగ్ చౌదరిని కోరారు. దక్షిణ భారతదేశంలోని ఇవి తయారీ కారిడార్లకు ఆంధ్రప్రదేశ్‌ను కీలక సరఫరాదారుగా నిలబెట్టాలనేది తమ సంకల్పని తెలిపారు. నెల్లూరు లేదా చిత్తూరు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లలో హిమాద్రి ఫేజ్-2 క్లీన్-టెక్ లేదా సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్