ప్రజాశక్తి - రేణిగుంట (తిరుపతి జిల్లా) : నారాయణ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... పిచ్చాటూరుకు చెందిన కె బాబు కుమారుడు పవన్ కల్యాణ్ (16) నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపిసి మొదటి సంవత్సరం హాస్టల్‌లో ఉండి చదువుతున్నాడు. హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. గమనించిన కళాశాల యాజమాన్యం అమర ఆస్ప్రతికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Print Editionనారాయణ విద్యార్థి ఆత్మహత్య
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 11:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)