గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనీట్‌-ఎస్‌ఎస్‌ అర్హత పర్సంటైల్ 30 శాతానికి తగ్గింపు

1 గంట క్రితం

NEET  case
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 12:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సుప్రీంకోర్టులో కేంద్రం అంగీకారం

న్యూఢిల్లీ : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-సూపర్ స్పెషాలిటీ (ఎన్‌ఇఇటి-ఎస్‌ఎస్‌) సీట్ల కోసం అర్హత పర్సంటైల్‌ను ప్రస్తుతం ఉన్న 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో అంగీకరించింది. అదే సమయంలో, తమిళనాడుకు సంబంధించిన 40 ఖాళీ ఇన్-సర్వీస్ సీట్లను రాష్ట్రానికి తిరిగి ఇచ్చేందుకు కూడా కేంద్రం ఒప్పుకుంది. అందుబాటులో ఉన్న సూపర్ స్పెషాలిటీ సీట్లు ఖాళీగా ఉండిపోకుండా, శిక్షణ సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు, సంబంధికులతో సంప్రదించిన మీదట నీట్‌-ఎస్‌ఎస్‌ అర్హత పర్సంటైల్‌ను ప్రతిపాదిత ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం 50వ పర్సంటైల్ నుంచి 30వ పర్సంటైల్‌కు తగ్గిస్తున్నామని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వ నోట్‌లో పేర్కొన్నారు. దీంతో, నీట్‌-ఎస్‌ఎస్‌లో 30వ పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులు ఈ ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో పాల్గొనేందుకు అర్హులవుతారు. నీట్‌-ఎస్‌ఎస్‌ కౌన్సెలింగ్ రెండో రౌండ్ పూర్తయిన అనంతరం ప్రస్తుతం 1,857 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం తన నోట్‌లో పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్