శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్‌ ఫలితాల్లో నారాయణ రికార్డు

1 గంట క్రితం

narayana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 11:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి - హైదరాబాద్‌ : ‌నీట్‌-2026 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థ రికార్డు సృష్టించింది. ఓపెన్‌ ‌కేటగిరీలో ఆలిండియా ఒకటో ర్యాంకు నారాయణ విద్యార్థి ఆర్యగన్‌ ‌గుప్తా సాధించి విజయపరంపరను కొనసాగించారు. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కేటగిరీల్లో టాప్‌ 12లోపు తొమ్మిది ర్యాంకులు నారాయణ విద్యార్థులే సాధించారని తెలిపారు. తొమ్మిదో ర్యాంకు గౌరవ్‌ ‌సింగ్‌, 15వ ర్యాంకు క్రిష్‌‌గుప్తా, 16వ ర్యాంకు కార్తీక్‌ ‌చౌదరి సాధించి సంచలన విజయం సాధించారని పేర్కొన్నారు. ఓపెన్‌ ‌కేటగిరీలో వందలోపు 18 ర్యాంకులు, వెయ్యిలోపు 49 ర్యాంకులు నారాయణ విద్యార్థులు సొంతం చేసుకున్నారని వివరించారు. అన్ని కేటగిరీల్లో 12లోపు తొమ్మిది ర్యాంకులు, వందలోపు 45 ర్యాంకులు, వెయ్యిలోపు 163 ర్యాంకులు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారికి సహకరించిన తల్లిదండ్రుడులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని వారు అభినందించారు.

నీట్‌ ‌ఫలితాల్లో శ్రీగోసలైట్స్‌ చరిత్ర

నీట్‌-2026 ఫలితాల్లో విజయవాడ శ్రీగోసలైట్స్‌ ‌మెడికల్‌ ‌విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో చరిత్ర సృష్టించారు. ఈ మేరకు శ్రీగోసలైట్స్‌ ‌మెడికల్‌ అకాడమి చైర్మెన్‌ ‌నరేంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కేటగిరీల్లో వందలోపు మూడు ర్యాంకులు, వెయ్యిలోపు ఏడు ర్యాంకులను సాధించామని తెలిపారు. 650కిపైగా మార్కులను 10 మంది, 600 మార్కులను 60 మంది, 570 మార్కులను 138 మంది, 550కిపైగా మార్కులను 245 మంది, 500కిపైగా మార్కులను 811 మంది విద్యార్థులు సాధించారని వివరించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్