బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీలో త్వరలో కొత్త రాజకీయ పార్టీ

1 గంట క్రితం

vijay sai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 10:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

తిరుమల: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజా పక్షంగా పనిచేసేలా పార్టీని తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. వారి తరఫున పోరాడే రాజకీయ వేదికగా కొత్త పార్టీని తీర్చిదిద్దుతామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కొత్త పార్టీ పేరు, విధివిధానాలు, జెండా, అజెండా తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణపై కూడా ఈ నెలలోనే పూర్తి స్పష్టత ఇస్తానని చెప్పారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్