బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అభిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

1 గంట క్రితం

kadiri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 11:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- టీడీపీ రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ రెడ్డి

ప్రజాశక్తి-కదిరి అర్బన్ : అభిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన వాల్మీకి పాఠశాల ఆవరణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వాల్మీకి పాఠశాల అధినేత, టీడీపీ రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ జాబ్ మేళాకు వివిధ రంగాలకు చెందిన సంస్థలు హాజరై అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకునేందుకు అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరుకావాలని కోరారు.

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఈ జాబ్ మేళా మంచి అవకాశంగా నిలుస్తుందని తెలిపారు. కాబట్టి మన ప్రాంతంలోని నిరుద్యోగ యువత ఈ విషయాన్ని గమనించి ఈ నెల 22వ తేదీన వాల్మీకి పాఠశాల ఆవరణంలో జరిగే మెగా జాబ్ మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పవన్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్