ప్రజాశక్తి–సంతబొమ్మాళి : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో నిర్మితమవుతున్న పోర్టులో జీతాల కోసం కార్మికులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులు గురువారం కూడా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ఆందోళన తీవ్రతరం కావడంతో పోర్టు అధికారి రాఘవరెడ్డి కార్మికులతో చర్చించి త్వరలోనే జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే గత 20 రోజులుగా అధికారులు ఇదే మాట చెబుతున్నారని, ఇప్పటికీ జీతాలు చెల్లించలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించిన తర్వాతే విధుల్లో చేరుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోర్టు అధికారులు, కార్మికుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. జీతాలు పూర్తిగా చెల్లించే వరకు విధుల్లోకి వెళ్లేది లేదని కార్మికులు పట్టుబట్టి తమ నిరసనను కొనసాగించారు.
జీతాలు చెల్లించే వరకు విధుల్లోకి వెళ్లేది లేదు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 10:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)