- వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వికలాంగుల సాధికారత జాతీయ అవార్డులకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నుండి నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం.వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. వికలాంగుల సాధికారతకు వినూత్న రీతిలో విశేష కృషి చేసి జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు పాటుపడిన వారిని గుర్తించి గౌరవించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వారి సాధికారత జాతీయ అవార్డులను అందిస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేరొన్నారు. వికలాంగుల సాధికారతకు సంబంధించి నేషనల్ అవార్డు ఫర్ ఇండివిడ్యువల్ ఎక్సెలెన్స్-2026, నేషనల్ అవార్డ్సు ఫర్ ఇనిస్టిట్యూషన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఎంపవరింగ్ పెర్సన్స్ విత్ డిజబిలిటీస్ 2026 పేరిట జాతీయ అవార్డులను ప్రదానం చేయనుందని తెలిపారు. ఈ అవార్డులకు సంబంధించిన పూర్తి అర్హతలు, నామనేషన్ల పంపే విధానం తదితర వివరాలు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో జాతీయ అవార్డు మార్గదర్శకాల్లో పొందుపర్చబడి అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవార్డులకు సంబంధించిన ధరఖాస్తులు, నామినేషన్లను ఈ నెల 31వ తేదీలోగా www.awards.gov.in లో సమర్పించేందుకు అందుబాటులో ఉంటుందని డైరెక్టర్ పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)