18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ.. 29న పోలింగ్, ఫలితాలు
ప్రజాశక్తి-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు అధికారులు.. మరోవైపు.. ఈ నెల 29వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. అవసరమైతే 30న రీపోలింగ్ నిర్వహిస్తారు.
రెండో విడతలో భాగంగా రాష్ట్రంలో 4,960 సర్పంచ్ పదవులకు, 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి విడత పోలింగ్ నవంబర్ 26న, మూడో విడత డిసెంబర్ 2న జరగనుంది. ఈ మూడు దశల్లో కలిపి మొత్తం 13,167 సర్పంచ్, 1.32 లక్షలకు పైగా వార్డు సభ్యుల స్థానాలను భర్తీ చేయనున్నారు.








కామెంట్‌లు (0)