గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విపత్తు నిర్వహణలో కేంద్ర-రాష్ట్ర సమన్వయంపై అధికారుల చర్చ

31 జులై, 2026

sdram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తాడేపల్లి : రాష్ట్రంలో విపత్తు నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కార్యాలయాన్ని సందర్శించి సమగ్ర సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) 14వ బెటాలియన్ కమాండెంట్ పి.కె. తివారీ పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న విపత్తు నిర్వహణ వ్యవస్థలు, సంసిద్ధత చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. సమీక్షలో వడగాలులు, పిడుగుపాటు వంటి ప్రకృతి విపత్తుల నివారణ చర్యలు, రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బలోపేతం, ఆధునిక పరికరాల సమీకరణ, ఫైర్ సర్వీసుల విస్తరణ, అర్బన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (యుడిఎంఏ) ఏర్పాటు, రాష్ట్ర మరియు జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికల నవీకరణతో పాటు NDMIS, IDRN పోర్టళ్ల సమర్థ వినియోగంపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యాధునిక విపత్తు నిర్వహణ వ్యవస్థలను రాష్ట్రంలో మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్