- మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5 వేరియంట్‌ను పూణే ల్యాబ్‌లో గుర్తించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఉన్నతాధికారులతో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇది కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక ఉపవంశం, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో ఆర్ఎఫ్.5 కూడా ఒకటని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్‌ను సాధారణ జీనోమిక్ పర్యవేక్షణలో భాగంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఓమిక్రాన్ ఆర్‌ఎఫ్-5ఎన్‌యు ఎస్ఎఆర్ఎస్-సిఓసి2 గా కూడా పర్యవేక్షిస్తోందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఆర్ఎఫ్.5 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఆర్ఎఫ్.5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరమని ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆర్‌ఎఫ్.5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ ఉప-వేరియంట్ల లక్షణాల మాదిరిగానే ఉంటాయని తెలిపారు. ముఖ్యoగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, శరీర నొప్పులు ఉంటాయని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)