ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్ట్ : శ్రీశైలం తెలంగాణ పరిధిలో ఎడమ గట్టు పాతాళగంగలో స్నానానికి దిగి మునిగిపోయిన ఇద్దరు యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన సచిన్ రాజ్ పుట్ (22), అభిషేక్ చతుర్వేది ఇద్దరు ఆదివారం పాతాళగంగలో స్నానానికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. వారిలో సచిన్ రాజ్ పుట్ మృతి చెందారు. అభిషేక్ చతుర్వేదిని మత్స్యకారులు కాపాడారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను చతుర్వేదిని వెంటనే 108లో సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.








కామెంట్‌లు (0)