ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 81 మంది సైట్ ఇంజినీర్ల సేవలను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న 81 మంది సైట్ ఇంజినీర్ల సేవలను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగించనున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో కొనసాగుతున్న నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు నిరంతరాయంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రెగ్యులర్ పోస్టులపై కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన సిబ్బందిని అవసరాన్ని బట్టి కొనసాగించేందుకు అనుమతి ఉన్న నేపథ్యంలో, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్‌కు సంబంధిత పరిపాలనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
81 మంది సైట్ ఇంజినీర్ల సేవలకు ఏడాది పొడిగింపు
07 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 10:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)