సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిగ్రీలో 37.91శాతమే ప్రవేశాలు

1 గంట క్రితం

ug admission
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మిగిలిన 2,36,442 సీట్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పడిపోయింది. ఉన్న సీట్లలో కేవలం 37.91 శాతమే భర్తీ అయ్యాయి. ఆగస్టు 5వ తేదిన డిగ్రీ అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ ‌సోమవారంతో ముగిసింది. అభ్యర్ధుల అలాట్‌‌మెంట్‌ ఆర్డర్లను సోమవారం ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ ‌నారాయణ భరత్ గుప్తా విడుదల చేశారు. 1,57,830 మంది అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,49,707 మంది వెబ్‌ ఆప్షన్లు ఇవ్వగా అందులో 1,44,418 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,80,860 కన్వీనర్‌ ‌సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 70,060 సీట్లు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌‌లో 26,468 సీట్లు, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌లో 2,77,870 సీట్లు, యూనివర్సిటీల్లో 6,462 సీట్లు చొప్పున మొత్తం 3,80,860 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కేవలం 1,44,418(37.91శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 2,36,442 సీట్లు భర్తీ కాకుండా మిగిలాయి. అడ్మిషన్ పొందిన విద్యార్ధులు ఈ నెల 10వ తేదిల్లో తమ కళాశాలల్లో చేరాలని కమిషనర్‌ ‌తెలిపారు. 7వ తేది నుంచే తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్