రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ భాషావేత్త గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29న జరిపే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, తన పరిధిలోని ఆర్‌టిఐ కేసుల తీర్పుల ఉత్తర్వులను ఇకపై సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులోనే జారీ చేయనున్నట్లు రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఉత్తర్వులు వారికి అర్థం కాని ఆంగ్ల భాషలో ఉంటే, తమ కేసులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. తెలుగులో ఉత్తర్వులు ఇస్తే కేసులో ఏం జరిగింది, ఏ నిర్ణయం తీసుకున్నారు, అధికారులకు ఏ ఆదేశాలిచ్చారు.. అనే విషయాలను అర్జీదా రులు స్వయంగా తెలుసుకోగలరని అన్నారు. ఇది కేవలం భాషకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, పారదర్శకత, జవాబు దారీతనం, పౌర సాధికారతకు సంబంధించిన అంశమని కమిషనర్ పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)