సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

24 ఆగస్టు, 2026

aituc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ ఆర్‌ ‌టిసిలో పనిచేస్తున్న సుమారు 8 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్‌, ఎస్‌ వెంకటసుబ్బయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం గొల్లపూడిలోని ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో ఎపిఎస్‌ ఆర్‌ ‌టిసి (పిటిడి) ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌ ‌టిసి ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఆర్‌‌టిసి ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జివి నరసయ్య మాట్లాడుతూ థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చాలని కోరారు.ఈ సందర్భంగా ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగుల నూతన రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా దాసరి కిరణ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా టి.గంగాజనేయులు ఎన్నికయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్