బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition పరమేశన్ మృతి ప్రజా సైన్సు ఉద్యమానికి తీరని లోటు

1 గంట క్రితం

Parameshan Memorial Meeting
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్

ప్రజాశక్తి - కడప అర్బన్ : ఎంపి పరమేశన్‌ ‌మృతి ప్రజా సైన్సు ఉద్యమానికి తీరని లోటని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌గేయానంద్‌ అన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మరాజ అధ్యక్షతన కడపలో పరమేశన్‌ ‌సంస్మరణ సభను బుధవారం నిర్వహించారు. విజ్ఞాన వేదిక, యుటిఎఫ్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తొలుత పరమేశ్వరన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గేయానంద్ మాట్లాడుతూ... పరమేశన్‌ ‌మృతి భారత ప్రజా విజ్ఞాన ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మరణం ఒక వ్యక్తి జీవితానికి ముగింపు మాత్రమేనని, కానీ ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ ఆలోచనలతో మూఢనమ్మకాలను ఎదిరించే ప్రతి కార్యకర్తలోనూ... ప్రజల కోసం విజ్ఞానాన్ని ఆశించే ప్రతి ఉపాధ్యాయుడిలోనూ ఆయన ఆశయాలు, ఆలోచనలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆయన దృష్టిలో శాస్త్రీయ దృక్పథం అంటే ప్రశ్నించడం, పరిశీలించటం, అర్థం చేసుకోవడం, అపోహలను తిరస్కరించటం, కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం సిద్ధంగా ఉండడమేనన్నారు. అక్షరాస్యత, పర్యావరణం, ఆరోగ్యం, అభివృద్ధి, విద్య మరియు ప్రజాస్వామ్యం వంటి ప్రతి రంగాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలని ప్రజలను ప్రోత్సహించినట్లు తెలిపారు. ప్రజలకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించడంతో పాటు, వారి అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకుని... సమాజాన్ని మార్పు దిశగా నడిపించేలా ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. కేరళం అక్షరాస్యత ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శంగా నిలవడంలో పరమేశ్వరన్ కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, డాక్టర్‌ ‌రాజావెంగళ్‌‌రెడ్డి, కడప బాలోత్సవం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రాహుల్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, ఐద్వా నాయకులు ఐ.ఎన్.సుబ్బమ్మ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్