శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డిఎడ్ లో 97.28శాతం ఉత్తీర్ణత

1 గంట క్రితం

ded
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 09:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డిఎడ్) నాల్గవ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 97.28శాతం మంది ఉత్తీర్ణత సాధించారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024-26 రెగ్యులర్ అభ్యర్ధులు, 2022-24,2023-25 ఫెయిలైన అభ్యర్ధులకు ఏప్రిల్ 20 నుంచి 23వ తేది వరకు నిర్వహించిన పరీక్షలకు 1177 మంది అభ్యర్ధులు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 1145(97.28శాతం) మంది అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. డమ్మీ మార్కుల మెమో www.bse.ap.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచామని తెలిపారు. మార్కుల రీకౌంటింగ్ కోసం అభ్యర్ధులు ఈ నెల 12వ తేదిలోపు సబ్జెక్టుకు రూ.500ల చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్