శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పులుల సంరక్షణకు పవన్‌ ప్రత్యేక చొరవ

1 గంట క్రితం

pawan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 09:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- గౌర్‌ల పునఃప్రవేశ ఒప్పందాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నాగార్జునసాగర్‌, శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో పులుల సంరక్షణను బలోపేతం చేయడంతోపాటు, అడవి దున్నల (గౌర్‌) పునఃప్రవేశానికి సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కోరారు. ఈ అంశాలపై చర్చించేందుకు ఎపిలో పర్యటిస్తున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌తో శనివారం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌ 2.0లో పాల్గొనేందుకు వచ్చిన మోహన్‌ యాదవ్‌కు పవన్‌ కల్యాణ్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.ఈ సందర్భంగా మోహన్‌ యాదవ్‌ను ఉప్పాడ పట్టు శాలువాతో పవన్‌ కల్యాణ్‌ సత్కరించారు. శ్రీరామ పట్టాభిషేకం కొండపల్లి కళాకృతి, శ్రీకాళహస్తి కళాకారులు రూపొందించిన శ్రీ దుర్గాదేవి చిత్రపటం, అరకు కాఫీని బహూకరించారు. ప్రతిగా మోహన్‌ యాదవ్‌ శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రతిమతోపాటు జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్