ప్రజాశక్తి-అమరావతి : సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15.80 కోట్ల ఫీజులు చెల్లించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మాజీ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసుల్లో లూథ్రా వాదనలు వినిపించారని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు భారీగా ప్రజాధనం ఫీజుల రూపంలో చెల్లించారని పిటిషనర్ పేర్కొన్నారు. 2024 జూన్ నుంచి 2026 జూన్ మధ్య లూథ్రాకు రూ.15.80 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఈ చెల్లింపులకు సంబంధించిన జిఓలను రద్దు చేయాలని, లూథ్రాకు చెల్లించిన అదనపు మొత్తాన్ని తిరిగి రాబట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 2022 ఆగస్టులో జారీ చేసిన జిఓ 214 ప్రకారం న్యాయవాదులకు కేసుకు గరిష్టంగా రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉండగా, లూథ్రాకు మాత్రం ఆ పరిమితికి మించి భారీ మొత్తంలో ఫీజులు చెల్లించారని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు సిద్ధార్థ లూథ్రాను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.
Print Editionలూథ్రా ఫీజులపై పిల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 26, 2026, 11:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)