టోకెన్ లేని వారికి సర్వదర్శనానికి 6 గంటల సమయం
ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 9 కంపార్ట్‌మెంట్లలో యాత్రికులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని యాత్రికులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 83,745 మంది యాత్రికులు దర్శించుకున్నారు. 19,391 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.2.99 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.








కామెంట్‌లు (0)