ప్రజాశక్తి-తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్ట్మెంట్లలో యాత్రికులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని యాత్రికులకు సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. నిన్న (గురువారం) శ్రీవారిని 56,695 మంది యాత్రికులు దర్శించుకున్నారు. 24,786 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.28 కోట్ల ఆదాయం సమకూరినట్లు టిటిడి వెల్లడించింది.
తిరుమలలో 6 కంపార్ట్మెంట్లలో యాత్రికుల నిరీక్షణ
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 08:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)