మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర సర్వీసులకు పీయూష్

2 గంటల క్రితం

puyush
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 10:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే అయన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అయన రాష్ట్ర విధుల నుంచి విడుదల అవుతారని అంటున్నారు. అయన చాలాకాలంగా ఆర్థికశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ బదిలీలు చేయాలనీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పీయూష్ బదిలీ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే అయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం సచివాలయంలో చక్కర్లు కొడుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్