సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసెర్బియా అధ్యక్షుడి రాజీనామా

1 గంట క్రితం

సెర్బియా అధ్యక్షుడి రాజీనామా
- అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థుల పోరు
- ప్రజాగ్రహంతో పదవి నుండి తప్పుకున్న  అలెగ్జాండర్‌ వుసిచ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థుల పోరు

  • ప్రజాగ్రహంతో పదవి నుండి తప్పుకున్న అలెగ్జాండర్‌ వుసిచ్‌

​బెల్‌గ్రేడ్‌ : సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వుసిచ్‌ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే నెల 25న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసి ప్రధాని పదవిని చేపట్టేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తి దేశాధ్యక్ష పదవికి మూడోసారి పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఉచిచ్‌ రాజీనామా నేపథ్యంలో పార్లమెంట్‌ స్పీకర్‌ అనా బర్నా బిజ్‌కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

విద్యార్థుల ఆగ్రహం..

దేశంలో విద్యార్థుల నేతృత్వంలో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా సుమారు రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అవినీతి సామ్రాట్‌ వుసిచ్‌ ‌రాజీనామా చేయాల్సిందేనని విద్యార్ధులు ఆందోళనలు చేపట్టారు. 2024 నవంబర్‌ 1వ తేదీన ఉత్తర సెర్బియాలోని నోవీ సాద్‌లో రైల్వే స్టేషన్‌ పైకప్పు కూలి 16 మంది మృతి చెందడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. న్యాయం కోసం, అవినీతికి వ్యతిరేకంగా వారు చేపట్టిన ఆందోళన క్రమేపీ బలమైన ఉద్యమంగా రూపుదిద్దుకుంది. 14 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వుసిచ్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఉద్యమకారులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వీరి ఉద్యమానికి ప్రజల నుండి కూడా మద్ధతు రావడంతో ఎట్టకేలకు వుసిచ్‌ ‌రాజీనామా చేశారు. అయితే, ప్రజా వ్యతిరేకతను పట్టించుకోకుండా ఎన్నికల బరిలో దిగుతానని ఆయన ప్రకటించారు. వుసిచ్‌ సెర్బియన్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ప్రజల్లో తనపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నప్పటికీ ఆయన నేతృత్వంలోని పార్టీ అధికారంలో కొనసాగేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. రాజీనామా పత్రంపై సంతకం చేయడానికి ముందు అధ్యక్షభవనం వెలుపల తన మద్దతుదారులను ఉద్దేశించి వుసిచ్‌ ప్రసంగిస్తూ ‘ఈ రాత్రి నాకు ఎంతో ప్రత్యేకం. ఈ అందమైన భవనంలో ఇదే నాకు చివరి రాత్రి. అయితే నేను భవిష్యత్తును చూస్తున్నాను. కొత్త విజయాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్