ప్రజాశక్తి - గన్నవరం : యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్‌ను విచారణ నిమిత్తం రిమాండ్ నుండి పోలీసు కస్టడీకి కోరుతూ కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కస్టడీ పిటిషన్‌ను పోలీసులు హఠాత్తుగా ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని రావణ్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రశ్న రావణ్‌ను కస్టడీకి కోరుతూ గన్నవరం పోలీసుల పిటిషన్ పై శుక్రవారం వాదనలు జరగాల్సి ఉండగా, ప్రాసిక్యూషన్ వారు మంగళవారానికి వాయిదా కోరారని అన్నారు. తీరా మంగళవారం కూడా ప్రాసిక్యూషన్ తరఫున ఎవరూ హాజరుకాకపోగా, పోలీసులు తాము వేసిన కస్టడీ పిటిషన్‌ను పూర్తిగా విరమించుకున్నారని చెప్పారు. కోర్టులో ఒకసారి పిటిషన్ వేసి, అది సరిగా లేదని భయపడి వెనక్కి తీసుకోవడం నా సుదీర్ఘ కెరీర్‌లో ఇదే మొదటిసారి చూశానని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. వైసిపికి గానీ, ఆ పార్టీ సిద్ధాంతాలకు గానీ రావణ్‌తో ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదన్నారు. రావణ్‌పై అత్యంత కఠినమైన ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం ముమ్మాటికీ దుర్మార్గం, చట్టవిరుద్ధమని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నిలదీసినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఉపా చట్టాన్ని అక్రమంగా ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఆయన వెంట పలువురు న్యాయవాదులు ఉన్నారు.
Print Edition‘ప్రశ్న’ రావణ్ కస్టడీ పిటీషన్‌ను వెనక్కి తీసుకున్న పోలీసులు
14 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 11:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)