మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పూజా హెగ్డే బర్త్ డే స్పెషల్

1 గంట క్రితం

పూజా హెగ్డే బర్త్ డే స్పెషల్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 08:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దుల్కర్‌ సల్మాన్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీ’. మంగళవారం పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మీ ఆకర్షణ, హుందాతనం ఈ కథను మరింత అందంగా తీర్చిదిద్దాయి’ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్‌ జోడించింది. రవి నేలకుడితి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, దీక్షిత్‌ శెట్టి, రావు రమేష్‌, సచిన్‌ ఖేడేకర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు. అయితే, చిత్రీకరణ ఆలస్యం కావడంతో విడుదల తేదీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్