శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

థర్మల్‌ ‌కేంద్రాల్లో పెరిగిన విద్యుదుత్పత్తి

7 గంటల క్రితం

Vijayanand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 09:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జెన్‌‌కో థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేశాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ ‌వెల్లడించారు. ఏప్రిల్‌ ‌నుంచి సెప్టెంబరు ‌వరకు 19,268 మిలియన్ యూనిట్ల (ఎంయు) విద్యుదుత్పత్తి చేశాయని, ఇది గతేదాడితో పోలిస్తే 13.1 శాతం అధికమని తెలిపారు. విద్యుత్‌‌ సౌధలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో హెచ్చరికల నేపథ్యంలో రానున్న నెలల్లో రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా పటిష్టమైన ఇంధన భద్రత వ్యవస్థను, సమగ్ర ముందస్తు విద్యుత్ కొనుగోలు ప్రణాళికను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని విజయానంద్‌ ‌పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి లింకేజీ కింద రావాల్సిన బొగ్గు సరఫరా ఏప్రిల్–ఆగస్టు మధ్య భారీగా తగ్గిందని తెలిపారు. కేటాయించిన పరిమాణంలో ఎన్‌‌టిటిపిఎస్‌‌కు 35 శాతం, ఎంవిఆర్ ఆర్‌‌టిపిపికి 14 శాతం మాత్రమే అందిందని తెలిపారు. ఆగస్టులో ఎన్‌‌టిటిపిఎస్‌‌కు సరఫరా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఈ సమావేశంలో జెన్‌‌కో ఎమ్‌డి ఎస్‌ ‌నాగలక్ష్మి, ట్రాన్స్‌‌కో జెఎమ్‌డి సూర్యసాయి ప్రవీణ్‌ ‌చంద్‌, ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో డైరెక్టర్లు వెంకట రమణమూర్తి, ఎకెవి భాస్కర్, సుజయ్ కుమార్, అశోక్ కుమార్ రెడ్డి, ఎపిపిడిసిఎల్‌ ‌డైరెక్టర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్