ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమరింత పటిష్టంగా విద్యుత్ సరఫరా

16 జులై, 2026

Vijayanand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 11:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ లభ్యత, డిమాండ్, ఆగస్టు-సెప్టెంబర్ 2026 నెలలకు అవసరమయ్యే విద్యుత్ వనరులు, ఉత్పత్తి సామర్ధ్యం, ప్రసార వ్యవస్థ సన్నద్ధత, విద్యుత్ కొనుగోలు, బొగ్గు నిల్వలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. విద్యుత్ రంగ చరిత్రలో జులైలో అత్యధికంగా 285 మిలియన్ యూనిట్లు(ఎంయు) నమోదయిందని పేర్కొన్నారు. ఈ డిమాండ్ రానున్న నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని, ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా విద్యుత్ సంస్థలు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను సంసిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. విద్యుత్ డిమాండ్ ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పవర్ ఎక్స్ఛేంజ్ లు, టర్మ్ అహెడ్ మార్కెట్ వంటి వేదికల ద్వారా ముందస్తుగానే అదనపు విద్యుత్ ను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎపిఎస్పిడిసిఎల్, ఎపిఇపిడిసిఎల్, సిపిడిసిఎల్ సిఎండిలు ఎల్ శివశంకర్, ఐ పృథ్వీతేజ్, పి పుల్లారెడ్డి, ట్రాన్స్ కో డైరెక్టర్ ఎకెవి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాగా విద్యుత్ ప్రసార వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక అంతరాయం కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభావితమైన ప్రాంతాలకు కేవలం 37 నిమిషాల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని విజయానంద్ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్