ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ సహకార ఉద్యమ నాయకుడు, చేనేత రంగ అభివృద్ధికి విశేష సేవలందించిన ప్రగడ కోటయ్య జయంతిని ప్రతి ఏడాది జూలై 26న రాష్ట్ర అధికారిక వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ప్రతి సంవత్సరం జూలై 26న ప్రగడ కోటయ్య జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ఘనంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన వ్యయాన్ని ఆయా శాఖలకు కేటాయించిన బడ్జెట్ నుంచే భరించాలని సూచించింది. ప్రగడ కోటయ్య చేనేత కార్మికుల సంక్షేమం, సహకార రంగ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అధికారిక వేడుకగా ప్రగడ కోటయ్య జయంతి
17 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 10:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)