ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి డిమాండ్ చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీదేవి, కోశాధికారి డి శ్రీనివాస కుమారితో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బియ్యం కట్ట రూ.1800 నుంచి రూ.2000 వరకూ చేరిందన్నారు. కరువు, నిత్యావసరాల ధరల పెరుగుదల నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా ప్రజలందరికీ 14 రకాల నిత్యావసర వస్తువులను సబ్సిడీపై అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు బజార్లలో కూరగాయలు తక్కువ ధరలకు విక్రయించాలని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, దళారుల దోపిడీని అరికట్టాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వాటిని వచ్చే నెల రెండున ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలుతో ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య, సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలు అధికంగా ఉన్న బస్సు స్టాపుల వద్ద బస్సులను నిలపడం లేదన్నారు. అన్ని బస్టాప్‌ల వద్ద బస్సులు తప్పనిసరిగా ఆపాలని, మహిళలతో గౌరవంగా వ్యవహరించేలా సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
Print Editionధరలు తగ్గించాలి : ఐద్వా డిమాండ్
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 10:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)