హీరో ప్రిన్స్ మాస్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘మహా విజేత’ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. జాకెట్ ధరించి, చేతిలో తుపాకీ పట్టుకుని యుద్ధానికి సిద్ధమైన సైనికుడిలా ప్రిన్స్ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఆయన లుక్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ‘ఒక ఉద్వేగభరితమైన కొత్త రూపం.. ఒక తీవ్రమైన కొత్త ప్రపంచం.. మిమ్మల్ని ఉత్కంఠకు గురిచేసే ఓ మిషన్ రాబోతోంది’ అంటూ చిత్రబృందం పోస్టర్‌కు క్యాప్షన్ జోడించింది. అనిల్ కుమార్ రవికాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైట్‌స్టోర్మ్ సెల్యూలాయిడ్ సంస్థ నిర్మిస్తోంది.
Print Editionయుద్ధానికి సిద్ధమైన ప్రిన్స్!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 07:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)