గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతికి ప్రాధాన్యత : మంత్రి కొండపల్లి

57 నిమిషాల క్రితం

kondapalli.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 11:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎంఎస్‌ఎంఇ, సెర్ప్‌ శాఖ‌ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో గురువారం సిఇఒ వాకాటి కరుణ, డైరెక్టర్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై మంత్రి గురువారం సమీక్ష‌ నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1,02,009 సంఘాలకు రూ.15,054 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు అధికారులు తెలపగా, నిర్దేశించుకున్న రూ.36,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేలా బ్యాంకర్లతో సమన్వయం పెంచాలని ఆదేశించారు. స్త్రీనిధి ద్వారా 4.73 లక్షల మంది మహిళలకు రూ.4,800 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంకులు మంజూరు చేసే క్యాష్ క్రెడిట్ రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీల మినహాయింపు నిబంధనలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు తయారు చేసే 65 రకాల ఉత్పత్తులను విక్రయించడానికి 4 ‘స్వయం’ బ్రాండ్ సిగ్నేచర్ స్టోర్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, వారి కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించేలా సెర్ప్ అధికారులు నిరంతరం శ్రమించాలని మంత్రి కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్