ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత

06 అక్టోబర్, 2026

స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత
- ఎపి పిసిబి చైర్మన్ కృష్ణయ్య image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 08:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి పిసిబి చైర్మన్ కృష్ణయ్య

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్ : పరిశ్రమల్లో యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని ఎపి పిసిబి చైర్మన్‌ డాక్టర్‌ పి.కృష్ణయ్య సూచించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లిలోని రిలయన్స్‌ కన్స్యూమర్స్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ప్లాంట్‌ను కలెక్టర్‌ ఎ.సిరితో కలిసి కృష్ణయ్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి పానీయాల తయారీలో తోతాపురి, అల్ఫోన్సోతో పాటు స్థానికంగా విస్తారంగా లభించే బంగినపల్లి మామిడిని వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఫలితంగా స్థానిక రైతులకు మార్కెట్‌ అవకాశాలు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన కుటుంబాలు, గ్రామీణ యువతకు ఉపాధిలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభావిత గ్రామాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేటాయించే నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్‌‌డిఒ సందీప్ కుమార్, ఎపి ఐఐసిజెడ్ ఎం.మధుసూదన్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కిషోర్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి సంజీవ రాజు, రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్లాంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్