శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యుత్ బస్సుల ప్రైవేటు టెండర్లు రద్దు చేయాలి

3 రోజుల క్రితం

వినాయక నిమజ్జనానికి 700 ప్రత్యేక బస్సులు
- ట్యాంక్‌బండ్‌ సమీప ప్రాంతాల నుంచి నగర శివార్లకు సర్వీసులు
- సమాచారం కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
 ప్రజాశక్తి -హైదరాబాద్‌  బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 11:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విద్యుత్ బస్సుల ప్రైవేటు టెండర్లు రద్దు చేయాలి

  • ఆర్‌‌టిసి జెఎసి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 1,450 విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నిర్వహించేందుకు జారీ చేసిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని ఎపిపిటిడి (ఆర్‌‌టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి రాష్ట్ర కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి నాయకుల గూగుల్ మీట్‌లో సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల భద్రత, యాజమాన్యం ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. ఈ నెల 13న జారీ చేసిన టెండర్ల ద్వారా 29 డిపోల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రతిపాదన ఆర్‌టిసి భవిష్యత్తుతో పాటు సిబ్బంది ఉపాధికి ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్సుల వినియోగానికి తాము వ్యతిరేకం కాదని, వాటిని ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించడాన్నే వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బస్సులను కొనుగోలు చేసి, సంస్థ సొంత సిబ్బందితోనే నడపాలని సూచించారు. అవసరమైన డిపోలు, అనుభవజ్ఞులైన డ్రైవర్లు, సాంకేతిక సిబ్బంది, నిర్వహణ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఆగస్టు 12న యాజమాన్యం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, స్త్రీశక్తి పథకం కారణంగా పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 4 వేల కొత్త బస్సులను సమకూర్చాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు 2, నెల్లూరు 2, మంగళం డిపోలను తిరిగి ప్రారంభించాలని కోరారు. ప్రైవేటు టెండర్లను ఉపసంహరించుకుని జెఎసితో చర్చలు జరపాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ సమావేశంలో జెఎసి కో-కన్వీనర్లు పివి రమణారెడ్డి, జివి నరసయ్య, సిహెచ్ సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం, ఎస్‌వి శేషగిరిరావు, వైఎస్ రావు, కె సూర్యప్రకాశరావు, డి మాల్యాద్రితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్