ప్రజాశక్తి-మన్యం : కిసాన్ సంయుక్త మోర్చా, అఖిల భారత కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మన్యం జిల్లాలోని పార్వతిపురంలో నిర్వహించిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... కనీస వేతనాన్ని నెలకు రూ.26,000గా నిర్ణయించాలిని, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్లను రద్దు చేయాలిన డిమాండ్ చేశారు. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. పంటల ఉత్పత్తి ఖర్చులపై అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించి, కూలీలకు తగిన వేతనాలు అందించాలన్నారు. విద్యుత్తు, ఆర్టీసీ, మున్సిపాలిటీలలో ప్రైవేటీకరణ విధానాలను నిలిపివేయాలన్నారు.








కామెంట్‌లు (0)