మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీకి వర్ష సూచన.. మూడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు

1 గంట క్రితం

Rains continue in Visakhapatnam 42 mm recorded in 24 hours
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 09:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్