ప్రజాశక్తి-విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ., గరిష్ఠంగా 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు 48 గంటల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.
మరోవైపు.. తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురువారం (సెప్టెంబర్ 10) రాష్ట్రవ్యాప్తంగా వేడి, ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతూనే.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుచోట్ల అక్కడక్కడా వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.








కామెంట్‌లు (0)