గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు..

1 గంట క్రితం

Another depression – rains in AP..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు చోట్ల 30 నుండి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు వస్తాయని ఈ నేపథ్యంలోనే వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపింది.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వరకు ఆకాశంలో మేఘాలు, గాలుల ద్రోణి ఏర్పడినట్టు పేర్కొంది. కర్ణాటకలో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, యానాం పరిసర ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని తెలిపింది. ఇక గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులు వర్షసూచన ఉండటంతో వారికి ఎండల నుండి ఉపశమనం లభించనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్