- హైకోర్టు
ప్రజాశక్తి-అమరావతి : విశాఖపట్నం రూరల్ మండలం అడవి వరంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిలో ఏర్పాటు చేస్తున్న వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ విషయంలో చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేస్తూ, అవసరమైన పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే నిబంధనల ప్రకారం నిర్మాణ పనులు కొనసాగించాలని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత అధికా రులను బాధ్యులను చేస్తామని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అడవివరం గ్రామంలోని సర్వే నెంబరు 275, ముదసర్లోవ గ్రామంలోని సర్వే నెంబరు 26లో దేవస్థానానికి చెందిన 160 ఎకరాలను డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ పర్యావరణవేత్త, జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం మరోసారి విచారణ జరిగింది.








కామెంట్‌లు (0)