సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబలిమెల నీటి నిల్వలపై సమీక్ష

4 రోజుల క్రితం

బలిమెల.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 11:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 2025-26లో ఆంధ్ర కంటే ఒడిశా 22 టిఎంసిలు అధిక వినియోగం

ప్రజాశక్తి -సీలేరు (అల్లూరి జిల్లా) : ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్ర అధికారులు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జికె.వీధి మండలం సీలేరు ఎపి జెన్‌‌కో అతిథి గృహంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి నిల్వలను ఆయా రాష్ర్టాలు తమ వాటాగా ఎంతెంత వినియోగించుకున్నాయన్న అంశాలపై సమీక్షించారు. 2025- 26 నీటి సంవత్సరంలో ఆంధ్ర కంటే ఒడిశా 22.6865 టిఎంసిల నీటిని అధికంగా వినియోగించుకున్నట్లు ఇరు రాష్ట్ర అధికారులు లెక్కలు తేల్చారు. 2026-27 నీటి సంవత్సరంలో జులై నెలలో ఒడిశా తన వాటాగా 5.5065 టిఎంసిలు నీటిని వినియోగించుకోగా ఆంధ్ర తన వాటాగా 4.1569 టిఎంసిల నీటిని వినియోగించుకున్నట్లు నిర్ధారించారు. దీని ప్రకారం జులైలో కూడా ఆంధ్ర కంటే ఒడిశా 0.3536 టిఎంసిల నీటిని అధికంగా వినియోగించుకున్నట్లు అధికారులు తేల్చారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 22.7650 టిఎంసిల నీటి నిల్వలు, జ్వాలాపుట్‌లో 13.8497 ‌టిఎంసిలు నీటి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బలిమెల జలాశయానికి 4.5000 టిఎంసిలు, జ్వాలాపుట్‌‌లో 1.5000 టిఎంసి నీటి నిల్వలు వచ్చి చేరుతాయని లెక్కించారు. దీని ప్రకారం బలిమెల, జ్వాలాపుట్‌లో మొత్తం 47.8497 టిఎంసిలు నీటి నిల్వలు ఉంటాయని లెక్కలు కట్టారు. ఇందులో ఆంధ్ర వాటాగా 32.9429 టిఎంసిలు, ఒడిశా వాటాగా 8.968 టిఎంసిలు వాడుకునేలా ఇరు రాష్ట్రాల అధికారులు మధ్య నీటి పంపకాల ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఇరిగేషన్ విద్యుత్ ఉత్పత్తి అవసరాల మేరకు ఒడిశా 800 క్యూసెక్కులు , ఆంధ్ర 6000 క్యూసెక్కులు వినియోగించుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య ఏకగ్రీవంగా ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర తరఫున సీలేరు కాంప్లెక్స్ ఎపి జెన్‌‌కో అధికారులు జాకీర్ హుస్సేన్, ఇఇ టి.అప్పలనాయుడు, ఎడిఇ ఎస్.జైపాల్, ఒడిశా తరపున బలిమెల హైడ్రో ప్రాజెక్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఓంప్రకాష్ నాయక్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం.ఆనందరావు, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, చిత్రకొండ ఎర్త్ డాం డివిజన్ అధికారులు కైలాస్, సిహెచ్ సేతి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రంజన్ కుంతియా, జూనియర్ ఇంజనీరు జ్యోతి తపాన్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్